బాలయ్య ఈవెంట్‌కు ప‌వ‌న్?

941
- Advertisement -

నటసింహం బాలయ్య బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరింతగా దగ్గర కాబోతున్నారు. ఆల్ రెడీ బాలయ్య ఆన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా రాబోతున్న పవన్.. ఇప్పుడు బాలయ్య కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. ఇప్పటికే, ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్స్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, వారి ఆసక్తిని రెట్టింపు చేస్తూ.. ఇప్పుడు ఒక అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

వీర‌సింహా రెడ్డి సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేసింది. ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. కాగా ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గెస్టుగా తీసుకురావ‌డానికి నిర్మాత‌లు ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే నిజ‌మైతే ఇద్ద‌రి హీరోల ఫ్యాన్స్‌ కు పెద్ద పండ‌గ‌నే చెప్పాలి. అన్నిటికీ మించి పవన్ – బాలయ్య దగ్గర అవ్వడం ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ కానుంది.

మొత్తమ్మీద జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న వీర‌సింహా రెడ్డి పై ఫ్యాన్స్ లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. ఆ పెరుగుతున్న ఆసక్తికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ అనే వార్త.. ఇంకా ఫుల్ కిక్ ను ఇస్తోంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. బాల‌య్య హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

అన్‌స్టాపబుల్ టీజర్ లాంచ్…నాగార్జున

రవితేజ బౌండరీ దాటేస్తాడా ?

బెస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ముత్తయ్య…

- Advertisement -