పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల పవన్‌తో జోడీ కట్టనుందని టాక్ నడుస్తోంది. ఇప్పుడీ ఈ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి నిజంగానే శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందా ?. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం శ్రీలీల పై ఫోటోషూట్ కూడా రీసెంట్గా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. మొత్తానికి శ్రీలీల పవన్‌తో ఛాన్స్ కొట్టేసింది.
ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. వారిలో ఒకరిగా శ్రీలీల కాగా, మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంది. ఈ పాత్ర.. కథనే మలుపు తిప్పుతుంది. అందుకే, ఈ పాత్రలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను తీసుకోనున్నారు. ఇక హీరోయిన్స్ కంటే కూడా మరో కీలక పాత్ర ఈ సినిమాలో ఉందట. ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ ను ఒప్పించాలని హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ వార్త వాస్తవ రూపం దాల్చితే.. భారతీయ సినీ తెరకు మరో పండుగ ఖరారు అయినట్టే.
అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమా ఒప్పుకుంటాడని హరీష్ శంకర్ నమ్మకంగా ఉన్నాడు. కారణం ఈ కథ చాలా మలుపులు తిరుగుతుందట. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ – పవన్ కళ్యాణ్ మధ్య బలమైన ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయట. మరి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తోందో చూడాలి.
ఇవి కూడా చదవండి…