ఆగస్ట్‌ 15న పవన్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌..

108
pawan

పవన్ కల్యాణ్, రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ హిట్‌ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌గా ఓ మూవీ రూపొందుతున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఆగస్ట్‌ 15న పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు చిత్రం బృందం. ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ గ్లిమ్స్‌ను ఆగస్ట్‌ 15 ఉదయం 9.45 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

‘‘టైటిల్‌, ఫస్ట్‌ గిమ్స్‌తో పవన్‌ స్ట్రామ్‌ రాబోతుంది. ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అని నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పవన్ కల్యాణ్ లుంగీతో దర్శనమిచ్చారు.

ఇందులో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తోంది. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.