వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్

47
MP Santosh kumar

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈరోజు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రంగణంలో గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నగర్ మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,రాష్ట్ర చైర్మన్లు నాగుర్ల వెంకన్న, డా: కె వాసుదేవ రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.