ప్రజలకు పవన్‌ విషెస్‌..

416
Pawan Kalyan Wishes People On Eve Of Sankranti
- Advertisement -

తాజాగా ‘అజ్ఞాతవాసి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్‌కల్యాణ్.. ప్రస్తుతం తన ‘జనసేన’ పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ప్రజలతో మమేకం అవడానికై తన ‘జనసేన’ని జనం లోకి తెచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు వారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను ఆయన విడుదల చేశారు.

Pawan Kalyan Wishes People On Eve Of Sankranti
‘తెలుగు వారితో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వేడుకతో జరుపుకొనే పండుగ సంక్రాంతి. ధాన్యపు రాశులు ఇంటికి చేరే కాలం కావడంతో రైతులు సంతోషంతో జరుపుకునే సంప్రదాయపు పండుగ ఈ సంక్రాంతి. ఈ పండుగ తరుణాన నా తరుపున, జనసేన శ్రేణుల తరుపున తెలుగు వారికి, దేశ ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్..’ అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన ఈ ప్రెస్‌నోట్‌ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు పవన్.

- Advertisement -