పవన్‌ ట్విట్టర్ వార్..

296
Pawan Kalyan Tweets about Ravi Prakash,Rk
- Advertisement -

తనపై కొన్ని మీడియా సంస్థలు కక్షపూరితంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. శనివారం నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఇంతకాలం సహనంగా ఉన్నాం. ఇన్ని రోజులు ఇష్టానుసారం వ్యవహరించినా మౌనంగా భరించాం. సహనానికి కూడా హద్దు ఉంటుంది. వారు చేయాల్సిన తప్పులన్నీ చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 యాజమానులపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా బురదజల్లుతున్నారని ఆరోపణలు చేస్తూ టీవీ 9 రవిప్రకాశ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై జనసేనాని నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే.

Pawan Kalyan Tweets about Ravi Prakash,Rk

పవన్ కల్యాణ్ సదరు మీడియా సంస్థల అధిపతులపై తన ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్నారు. రెండు గంటల క్రితం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశిస్తూ ‘బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇదే సమయంలో టీవీ9 రవిప్రకాశ్ ను ఉద్దేశిస్తూ మరో ట్వీట్ ను పవన్ చేశారు. టీవీ9 రవిప్రకాశ్ కు సంబంధించి మా గ్రౌండ్ స్టాఫ్ ఇచ్చిన లేటెస్ట్ అప్ డేట్ ఇది అంటూ మెసేజ్ పెట్టారు. ‘టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై చెప్పుతో దాడి’ పేరుతో ఓ పేపర్లో వచ్చిన కథనాన్ని అప్ లోడ్ చేశారు.

- Advertisement -