‘నేల టిక్కెట్టు’ టీజర్ రిలీజ్..

287
- Advertisement -

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం “నేల టిక్కెట్టు”. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది. రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా కనిపించనుంది.

రవితేజ కొత్త సినిమా నేల టికెట్టు టీజర్ విడుదలైంది.

‘Nela Ticket’ Teaser Release Date

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ రోజు (ఆదివారం) ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ తో ఈ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చే దిశగా జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్ టైటిల్ తో మాస్ మహారాజ్ ను రంగంలోకి దింపుతోన్న కల్యాణ్ కృష్ణ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇంతవరకూ చేసిన రెండు సినిమాలతో హిట్స్ కొట్టిన కల్యాణ్ కృష్ణ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.

నేల టికెట్ గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు అంటూ చెప్పించి ఒక మంచి మసాలా ఫైట్ కూడా జోడించిన ఈ టీజర్ లో రవితేజ పాత్ర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తరహాలో ఉంటున్నట్టు కనిపిస్తోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ మూవీతోనే ఎస్ ఆర్టి సంస్థ టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. వచ్చేనెల చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

- Advertisement -