పవన్ ‘తమ్ముడు’ రీ రిలీజ్!

42
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు పవన్. ఇక తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు పవన్.

ఇక మరోవైపు పవన్ నటించిన సినిమాలు రీ రిలీజ్‌ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఖుషి, వకీల్ సాబ్, బద్రి సినిమాలు రీ రిలీజ్ కాగా తాజాగా తమ్ముడు సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది.

సరిగ్గా 25 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది తమ్ముడు మూవీ. 15 జులై 1999 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు అదే డేట్‌కు విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీంతో థియేటర్‌లో పవన్ సినిమాను చూసి ఎంజాయ్‌ చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

Also Read:బీహార్‌కు ప్రత్యేక హోదా తేవాలి:తేజస్వి

- Advertisement -