జనసేన పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై సినిమాల్లో నటించనని తెలిపిన పవన్ స్టాండ్ మార్చుకుని తిరిగి సినిమాల్లో నటిస్తాననడం బాధించిందన్నారు. పవన్ మాటల్లో నిలకడ లేదని అందుకే రాజీనామా చేస్తున్నానని …కానీ వ్యక్తిగతంగా జనసైనికులకు అందుబాటులో ఉంటానని లేఖలో తెలిపారు.
ఇక జేడీ రాజీనామాపై స్పందించారు పవన్ కళ్యాణ్. జేడీ పై అభిమానం ఉంటుందని చెబుతూనే కౌంటర్ ఇచ్చారు జనసేనాని. లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నానని అందుకే ఆయన . రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. పార్టీని నడిపేందుకు తనకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, గనులు లేవని సినిమాలే తనకు ఉన్న ప్రత్యామ్నాయమని తేల్చి చెప్పారు.
తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరని..వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఇదిఇలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వి.వి.లక్ష్మీనారాయణ ఓడిపోయిన సంగతి తెలిసిందే.