జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయ సభలు.. ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు, పార్టీని బలోపేతం చేయాలని పవణ్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇటీవల కాటమరాయుడు సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు పవన్. ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ కన్న కాస్త అలస్యంగా మొదలైంది. 2017 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ఫిక్సయిన పవన్.. జెట్ స్పీడుతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఈ సినిమా షూటింగ్ చేస్తూనే… తన తరువాతి ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్ చేసుకున్నాడు పవన్. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో పవన్, త్రివిక్రమ్ సక్సెస్ పుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. దీంతో మరోసారి జోడి కట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వీరు చేయబోయే నెక్ట్స్ మూవీపై క్లారిటి వచ్చేసింది.
అంతేకాదు ఈ సినిమాకు దేవుడే దిగి వస్తే .. అనే టైటిల్ అయితే ఎలా ఉంటుందని పవన్-త్రివిక్రమ్‌లు పరిశీలుస్తున్నారు. ఇప్పటికే దేవుడు కాన్సెప్ట్తో త్రివిక్రమ్, ఖలేజా సినిమాను తెరకెక్కించగా, పవన్, గోపాల గోపాల సినిమాలో దేవుడిగా నటించాడు. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి దేవుడు కాన్సెప్ట్తో సినిమా చేయాలని భావిస్తున్నారు. కాగా, ఈ సినిమాను త్రివిక్రమ్ గత చిత్రాలను నిర్మించిన రాధా కృష్ణ 100 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
ఇక జనసేన పార్టీతో 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ లోగా నాలుగైదు సినిమాలు చేయాలని పవర్ స్టార్ ఫిక్సయినట్టు సమాచారం. కాటమరాయుడు తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అదే ఏడాదిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ తరువాత 2018లో మరో రెండు సినిమాలు రిలీజ్ చేసి తరువాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పవన్-త్రివిక్రమ్‌ల సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రాకపోయినా అభిమానులు మాత్రం వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.