సినీ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోంటోన్న సంగతి తెలిసిందే. ఈమధ్యే తనకు ఎంగేజ్ మెంట్ కూడా జరిగినట్లు తెలిపింది రేణు దేశాయ్. దింతో పవన్ అభిమానులు రేణు దేశాయ్ కి పెళ్లి చేసుకోవద్దని మెసెజ్ లు పెడుతోన్నారు. పలువురు వ్యక్తులు ఆమె పెళ్లికి మద్దతు తెలుపుతుండగా..మరికొందరు ఆమె పెళ్లిని విమర్శిస్తోన్నారు. నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే మా దేవుడు పవన్ కళ్యాణ్ కు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని కొంత మంది ట్వీట్ చేస్తోన్నారు.
ఈసందర్భంగా ఆమెకు ట్వీట్టర్ లో మెసెజ్ లు ఎక్కువగా వస్తోండటంతో ఆమె తన ట్వీట్టర్ అకౌంట్ ను తొలగించింది. ట్వీట్టర్ లో విపరీతమైన నెగిటివిటి ఉందని తనకు అనిపిస్తోందన్నారు. ట్వీట్టర్ లో ఉన్న వాళ్లు ఎక్కువగా అజ్ఞాత వ్యక్తులని, వ్యక్తిగతంగా, వృత్తి పరంగా కోపంగా ఉన్నవాళ్లు ట్వీట్టర్ లో ఎక్కువగా ఉన్నారని ట్వీట్ చేసింది.
సినిమా వ్యక్తులపై కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ ఎప్పుడూ వ్యతిరేకంగా రాసేవారు ట్వీట్టర్ లో ఎక్కువ మంది ఉన్నారనన్నారు. ఈసందర్భంగా తాను ఒక నిర్ణయానికి వచ్చానని ఇక నుంచి ట్వీట్టర్ నుంచి తాను వైదొలిగిపోతున్నట్లు తెలిపింది. ఇక నుంచి తాను నూతన జీవితాన్ని ప్రారంభిస్తానని తెలిపింది. ఇంతకు ముందు నా లైఫ్ లో జరిగిన విషయాలను మర్చిపోతానని ట్వీట్ చేస్తూ ట్వీట్టర్ నుంచి వెళ్లిపోయింది. నా క్షేమం కోరుతూ నాకు అండగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా మెసెజ్ లు చేయటం వల్లే రేణు దేశాయ్ ట్వీట్టర్ నుంచి వైదొలిగిపోయారనే వార్తలు వినిపిస్తోన్నాయి.