Pawan:వైసీపీ నేతలు శత్రువులు కాదు ప్రత్యర్థులే

26
- Advertisement -

దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా వందశాతం గెలుపు ఒక్క జనసేన పార్టీకే సాధ్యమైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మంగళగిరిలో ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్…జనసేన పార్టీకి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి…అయినా తట్టుకునే నిలబడ్డామన్నారు. జనసేన గెలిచింది 21 స్థానాలే అయినా కూటమికి వెన్నుముకగా నిలిచామని స్పష్టం చేశారు.

వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని…. అలా అని ఇంట్లో కుటుంబ సభ్యులను ప్రజలపై రుద్దకండన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని రౌడీయిజం ఎవరైనా చేస్తే వాళ్ళని వదులుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. వైసీపీ నేతలు మనకు శత్రవులు కాదు… ప్రత్యర్థులు మాత్రమేనన్నారు. 151 సీట్లు వచ్చినవాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారు… అది గుర్తు పెట్టుకోవాలంటూ జనసేన శ్రేణులకు పవన్ సూచించారు.

మొదట్లో 60 స్థానాలు అనుకున్నా.. ఆ తరువాత 24 నుండి 21 తగ్గాను. తక్కువ సీట్లు అయినా బలమైన విజయం వచ్చిందని తెలిపారు పవన్. ఎవరిని వ్యక్తిగతంగా దూషించవద్దని… సబ్జెక్టుపై మాట్లాడండన్నారు.

Also Read:తప్పు చేసిన ఎవరిని వదలను!

- Advertisement -