ఓజీ సెట్స్‌లో పవన్‌!

16
- Advertisement -

ఏపీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక పాలిటిక్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యారు పవన్. ప్రస్తుతం పవన్ చేతిలో వరుస సినిమాలు ఉండగా ఇందులో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ ఒకటి.

ఈ సినిమా షూటింగ్‌ను పవన్‌ దాదాపుగా పూర్తి చేయగా పదిహేను రోజుల వర్క్‌ మాత్రమే మిగిలివుంది. దీనికోసం జూన్‌ నెలాఖరు నుంచి పవన్‌కల్యాణ్‌ డేట్స్‌ ఇచ్చారని సమాచారం. పవన్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన తర్వాత నెక్ట్స్ షెడ్యూల్‌ మొత్తం పవన్‌ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండగా ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కానుండగా శ్రీయారెడ్డి, ఇమ్రాన్‌ హష్మి, అర్జున్‌ దాస్‌, షాన్‌ కక్కర్‌, హరీశ్‌ ఉత్తమ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read:అండమాన్ నికోబార్ దీవుల్లో దేవర!

- Advertisement -