తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్

7
- Advertisement -

తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.

వైసీపీ హయాంలో పనిచేసిన TTD బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని..దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలన్నారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలని… బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలి అని పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గిందని, లడ్డు తయారు చేయడానికి యానిమల్ ఫ్యాట్ కలిసి ఉన్న నెయ్యిని వాడటమే దానికి కారణం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ల్యాబ్ రిపోర్ట్ బయటపెట్టారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బ తీసే దుశ్చర్య, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:కేంద్రమంత్రి తల తెస్తే.. 1.38 ఎకరాల భూమి ఇస్తా!

- Advertisement -