దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలోని రాజకీయ ఉద్యమాలపై చర్చలు ఊపందుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్….. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆవిర్భావంపై స్పందించారు. ప్రతి తరం తమదైన శైలిలో రాజకీయాన్ని, సమాజాన్ని నిర్మించే క్రమంలో ఇది ఒక భాగమని అభివర్ణించారు.
ఈ జెన్ జీ (Gen Z) అనే కాన్సెప్ట్ గురించి ప్రతి ఒక్కరూ ఇది అకస్మాత్తుగా ఊడిపడినట్లు చర్చిస్తున్నారు. కానీ అది అలా కాదు. మీరు 1920లు లేదా 1940లను చూసినట్లయితే ప్రతి 25 నుండి 30 సంవత్సరాలకు ఒక కొత్త యువతరం వస్తుంది వారు ఆలోచనను ముందుకు తీసుకెళ్తారు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read:‘రాజా ది రాజా’..యూత్ ఫుల్ మెలోడీ
ఈ ఉద్యమాన్ని కేవలం కొట్టిపారేయడానికి బదులుగా యువతీ యువకులు వ్యక్తం చేస్తున్న ఈ అసంతృప్తి…ఆగ్రహం వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని జనసేనాని అన్నారు.
కొంతమంది యువకులను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ ‘బొద్దింక’ అనే పదాన్ని ఉపయోగించడంతో దానికి ప్రతిస్పందనగా ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భవించింది.

