టీఎంసీ విలీనంపై అశోక్ గెహ్లాట్

1
- Advertisement -

గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి చీలిపోయి లేదా విడిపోయి స్వంత పార్టీలు పెట్టుకున్న రాజకీయ పక్షాలన్నీ తిరిగి మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌లో విలీనం కావాలని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా వారంతా రాహుల్ గాంధీని తమ నాయకుడిగా అంగీకరించాలని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ప్రతిపక్ష శ్రేణుల్లో రాహుల్ గాంధీ పట్ల నమ్మకం మరియు ఆదరణ విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ భావజాలం నుండి పుట్టి ఆ తర్వాత వ్యూహాత్మక విభేదాల వల్ల వేరుపడిన పార్టీలు ఇప్పుడు ఒకే వేదికపైకి రావడం చారిత్రక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో వేర్వేరు కారణాల వల్ల కాంగ్రెస్ నుండి విడిపోయిన నాయకులు, పార్టీలు చాలా ఉన్నాయి. కానీ నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే మేమంతా కలిసికట్టుగా నిలబడాలి. కాంగ్రెస్ నుండి విడిపోయిన వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరండి లేదా కలిసి పనిచేయండి అని గెహ్లాట్ అన్నారు.

ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలను గట్టిగా ఎదిరించగల సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందని గెహ్లాట్ ఉద్ఘాటించారు. రాహుల్ గాంధీ చేపట్టిన సుదీర్ఘ యాత్రలు…ప్రజా పోరాటాలు ఆయనను ఒక పరిణతి చెందిన నాయకుడిగా నిలబెట్టాయని ప్రజలు ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు.

Also Read:సింగ్ గీతం..పెద్ద బ్లాక్‌బస్టర్!

దేశంలో బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలంటే అహంకారాలను పక్కనబెట్టి, కాంగ్రెస్ బలోపేతానికి మరియు రాహుల్ గాంధీ నాయకత్వానికి అందరూ మద్దతు పలకాలని అశోక్ గెహ్లాట్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

- Advertisement -