పవన్ ఇరకాటంలో పడుతున్నాడా ?

44
- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎటు తెలుచుకోలేక ఇరకాటంలో పడుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఏపీ పోలిటికల్ వర్గాలు. ఎందుకంటే పొత్తుల విషయంలో ఆయన ఇస్తున్న సంకేతాలు పవన్ను సందిగ్ధంలోకి నెడుతున్నాయి. మొదటి నుంచి తాము బీజేపీ మిత్రపక్షమే అని చెబుతున్నా పవన్.. ఆ పార్టీతో ఇంతవకు కలిసినడిచిన దాఖలలే లేవు. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనిచ్చేది లేదని చెబుతూ టీడీపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఆ మద్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో టీడీపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా చెబుతూనే బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఉందనే విధంగా చెప్పుకొచ్చారు.

దీంతో పవన్ తీరుపై కమలనాథులు కాస్త అసంతృప్తిగానే వున్నారు. ఇక తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలు రాబట్టింది. దీంతో టీడీపీతో కలవడమే ఉత్తమం అనే భావనలో పవన్ ఉన్నారట. అయితే బీజేపీ దోస్తీని కూడా విడిచేందుకు పవన్ సిద్దంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల పవన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో పవన్ ఏం చర్చించారనేదే ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టీడీపీతో కలవాలనే ప్రతిపాదనను పవన్ నడ్డా ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీతో కలిసి నడవడమే ఉత్తమమని, 2014 కూటమిని రిపీట్ చేయాలని పవన్ నడ్డాను కోరినట్లు తెలుస్తోంది.

అయితే పవన్ ప్రతిపాదనపై నడ్డా నుంచి సరైన స్పందన రాలేదట. టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని కమలం పార్టీ నేతలు మొదటి నుంచి కూడా చెబుతున్నారు. పవన్ భేటీలో కూడా నడ్డా అదే మాటకే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పవన్ టీడీపీతో కలవాలా ? లేదా బీజేపీతోనే ఉండాలా ? అనే దానిపై సందిగ్ధంలో ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడినా పవన్.. వైసీపీ ముక్త్ ఏపీ అనే నినాదాన్ని మరోసారి వినిపించారు. అందుకోసం ఏం చేయాలో దానిపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి ఏపీలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని భావిస్తున్న పవన్ కు ఈ పొత్తుల అంశం తలనొప్పిగా మరి ఇరకాటంలోకి నేడుతోంది. మరి రాబోయే రోజుల్లో పవన్ ఎటువైపు అడుగేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

TELANGANA:అదంతా.. బండి సంజయ్ కుట్ర!

KCR:అంబేద్కర్ అందరివాడు

KTR:బండిపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌

- Advertisement -