తదుపరి చిత్రంపై పవన్‌ క్లారిటీ..!

272
Pawan Kalyan
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ తర్వాత చేయనున్న తదుపరి చిత్రంపై ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. దాదాపు పవర్‌ స్టార్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పాడని తెలుస్తోంది. పవన్‌ ప్రజా సమస్యల పరిష్కారం కోసం  ప్రజా యాత్రలతో ముందుకెళ్లున్నారు. వచ్చే 2019 ఎన్నికల వరకు తన పార్టీ జనసేనను మరింత బలోపేతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్‌.

Pawan Kalyan

ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో పవన్ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలపై పవన్ తాజాగా ఓ ప్రకటనలో స్పందించారు. ‘నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదు.

ప్రజా జీవితానికే పూర్తి సమయం కేటాయించాను. ప్రజల్లోనే ఉంటూ, జన సైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే’ అంటూ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

- Advertisement -