పవన్ సినిమా నుండి లీకులు

25
- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ తో కలిసి వినోదాయ సీతమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాను లీకులు ఇబ్బంది పెడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ , సాయి ధరం తేజ్ ఇద్దరి కలిసి నటిస్తున్న సీన్ తాలూకు స్టిల్స్ లీకుల ద్వారా బయటికొచ్చేశాయి. దీంతో పవన్ , తేజ్ లీక్ ఇమేజస్ వైరల్ అవుతున్నాయి. మేకర్స్ ఎంత జాగ్రత్త తీసుకున్నా ఇలాంటి లీకులు ఎలా జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. ఇక లీకైనా స్టిల్స్ లో పవన్ నిలబడి తేజ్ తో ఏదో చెప్తున్నట్టు కనిపిస్తుంది. వెనుక ఓ బైక్ కనిపిస్తుంది.

అయితే లీకైనా స్టిల్స్ లో పవన్ గోపాల గోపాల లాంటి లుక్ లోనే కనిపిస్తున్నాడు. కాకపోతే స్టైలిష్ లుక్ కాకుండా సింపుల్ గా ఉన్నాడు. ఇక నుండి ఈ సినిమా లీకులపై టీం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి…

నటుడు పై విష ప్రయోగం !

రాజమౌళి..రిచర్డ్ పోస్ట్‌కు ఉద్వేగానికి లోనైన కీరవాణి

ఆస్కార్ తెచ్చిన గౌరవం ఇది!

- Advertisement -