ఆస్కార్ తెచ్చిన గౌరవం ఇది!

35
- Advertisement -

ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే, తన నాటు నాటు పాటతో పాటు సినిమా కూడా హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్‌కు బాగా నచ్చినట్లు చంద్రబోస్ వెల్లడించారు. టామ్ క్రూజ్ ను చూసినప్పుడు అతని దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకున్నట్లు తెలిపారు. అప్పుడు ఆయన వావ్.. నాకు ఆర్ఆర్ఆర్ నచ్చింది. నాటు నాటు నచ్చింది అన్నారని చెప్పారు చంద్రబోస్.

మొత్తానికి ఆస్కార్ అవార్డు గ్రహీతగా చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. చంద్రబోస్ కు ఈనెల 28న రవీంద్ర భారతిలో అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ‘నాటు నాటు’ పాటతో సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగాణ సమాజం గర్వించతగిందని పేర్కొన్నారు.

పాటకు సంగీతం, నృత్యం, దర్శకత్వం వహించిన వారందరికీ అభినందనలు తెలిపారు. మొత్తమ్మీద చంద్రబోస్ కు 28న అభినందన సభ జరగబోతుంది. పాటల రచయితగా చంద్రబోస్ కి ఎంతమంచి పేరు ఉన్నా.. ఆయనకు ఆస్కార్ ఇచ్చిన గౌరవం మాటల్లో చెప్పలేనిది.

ఇవి కూడా చదవండి…

మార్చ్ సినిమా సందడి

హీరోగా రోషన్ కనకాల..

భువన విజయమ్..టీజర్ లాంఛ్‌

- Advertisement -