రాజమౌళి..రిచర్డ్ పోస్ట్‌కు ఉద్వేగానికి లోనైన కీరవాణి

55
- Advertisement -

ఆస్కార్ విజేత కీరవాణి… అమెరికా దిగ్గజ సంగీతకారుడు రిచర్డ్ కార్పెంటర్ ఇచ్చిన సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని రాజమౌళి తెలిపారు. ఆస్కార్ మొత్తం క్యాంపైన్‌లో ఒక్కసారి కూడా భావోద్వేగానికి లోనుకాలేదని కానీ రిచర్డ్ కార్పెంటర్ ఇచ్చిన సర్‌ఫ్రైజ్ వల్ల ఉద్వేగానికి గురైనట్టు చెప్పారు.

సర్ ఆస్కార్ ప్రచారంలో మొత్తం అన్నయ్య ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదు. ఆస్కార్‌ గెలుపొందడానికి ముందు ఆ తర్వాత కూడా ఆయన ఏ విధమైన భావోద్వేగానికి బయటపెట్టలేదు. కానీ మీ పోస్టు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మా కుటంబానికి ఇదొక మధురానుభూతి అని రాజమౌళి తెలిపారు.

ఆస్కార్ స్టేజ్‌పై కీరవాణి తన దైన శైలిలో తనకు నచ్చిన టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ సాంగ్‌ను మార్చి పాడిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని స్పందించిన కార్పెంటర్ కీరవాణి చంద్రబోస్‌లకు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెలతో కలిసి ఆయన టాప్ ఆఫ్ ది వరల్డ్…పాటను పాడుతూ ఆర్ఆర్ఆర్ టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్పారు. అయితే దీనిపై రాజమౌళి స్పందించారు.

ఇవి కూడా చదవండి…

కిరణ్ అబ్బవరం…’మీటర్’

ఆస్కార్ తెచ్చిన గౌరవం ఇది!

మార్చ్ సినిమా సందడి

- Advertisement -