యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారు..యూనివర్సిటీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదు అని తెలంగాణ పృథ్వీ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యా వ్యవస్థను ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతుంది..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటు ఆస్పత్రులను ప్రమోట్ చేసేలా వ్యవహరిస్తున్నారు అన్నారు.
ప్రైవేటు విద్యాలయలు ఫీజుల పేరుతో దోచుకుంటున్నారు..వేలకోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు నోచుకోవడం లేదు..సీ ఎస్ ఆర్ నిధులతో ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు..ప్రభుత్వ బడులు గంజాయి అడ్డాగా మారాయి.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు..ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలి..విద్యాశాఖ కు 15% బడ్జెట్ కేటాయిస్తామని.. 8 శాతం కేటాయించారు..ఆ నిధులు జీతాలకే సరిపోతాయి..కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది అన్నారు.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల కోసం రవాణా సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు అని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ అన్నారు. ఆచరణలోకి మాత్రం రాలేదు..మాటలకు చేతులకు పొంతనలేదు..విద్యా కమిషన్ రిపోర్టర్ ను కూడా పట్టించుకోవడం లేదు..ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలి..
బ్రేక్ ఫాస్ట్ పథకం కూడా ప్రచారంగానే మిగిలింది..బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నార అని అడుగుతున్నాం అన్నారు.
21 వేల కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.. ఇది కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి ఏర్పాటు చేస్తున్నారు…విద్యాశాఖ అధికారుల్లో సమన్వయం లేదు..గిరిజన ప్రాంతాల్లో అవుటు సోర్సింగ్ ఉద్యోగులతో విద్యను అందిస్తున్నారు..బ్రేక్ ఫాస్ట్ పథకంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రారు అన్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో మాలిక వసతులు కల్పించాలి అన్నారు.
Also Read:మీనాక్షి ఎపిసోడ్..పూర్తి వివరాలివే
ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయడం లేదు అన్నారు పాశం యాదగిరి.ప్రభుత్వ కుట్రలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించారు..పేదోడికి చదువును దూరం చేస్తున్నారు..ప్రస్తుతం బడ్జెట్లో విద్యకు 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు..ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తిరుమల మాట్లాడుతూ.. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండి ప్రొఫెసర్ల ఇళ్లకు వెళ్లేవారు..వివిధ అంశాలను సమగ్రంగా తెలుసుకునేవారు..ప్రస్తుతం రాజకీయ నాయకులు విషయ పరిజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు..ఎమ్మెల్యే, ఎంపీల ప్రమాణస్వీకారం తర్వాత వాళ్లకు రాజ్యాంగంపై తరగతులు నిర్వహించాలి..ప్రస్తుతం నాయకులకు రాజ్యాంగంపై అవగాహన లేదు..ఓట్ల కోసమే మేనిఫెస్టోలు రూపొందిస్తున్నారు.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చడం లేదు..అతిథి ఆధ్యాపకులు హెచ్ఓడిగా వ్యవహరిస్తున్నారు..అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు అన్నారు.

