బండి సంజయ్‌కి హైదరాబాద్‌లో పాలు తాగితే జ్వరం వచ్చిందంట …ఆయన కుమారుడు చేసిన పనికి, అతనిని కాపాడడానికి బండి సంజయ్ 9 రోజులు చేసిన హై వోల్టేజ్ డ్రామా చూసి తెలంగాణ ప్రజలందరికి జ్వరం వచ్చింది అని తెలిపారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఖమ్మంలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే మా మాజీ మంత్రులు వెంటనే బాధితురాలిని పరామర్శించారు..మీరేమో బండి సంజయ్ కొడుకును 9 రోజులు దాచి పెట్టారు.. కానీ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వచ్చారా? చెప్పాలన్నారు. ఈ పోక్సో కేసులో బండి సంజయ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారా? ఆయనను విచారించారా? చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని వచ్చిన ఒక మహిళా మీనాక్షిని వెన్నుపోటు పొడిచే పనిలో ఉన్నాడు … సీతక్క మీరు రీల్స్ బాగా చేస్తారు అంట కదా ..తెలంగాణలో మైనర్ బాలికల మీద జరుగుతున్న ఆకృత్యాల మీద ఒక రీల్ చేయండి అని ఎద్దేవా చేశారు. మైనర్ బాలికలపై ఆకృత్యాలు జరగకుండా తల్లిదండ్రులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read:సింగ్ గీతం..పెద్ద బ్లాక్‌బస్టర్!

