- Advertisement -
ఈ సంవత్సరం పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల మధ్య సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్ సభ, రాజ్యసభ ఒకే సారి కాకుండా వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి.
ఏప్రిల్ 8 వరకూ ఈ సమావేశాలు సాగనుండగా, పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఫైనాన్స్ బిల్లుతో పాటు పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లులు ఈ సమావేశాల్లో కీలకం కానున్నాయి. ఇదే సమయంలో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది.
- Advertisement -