23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

250
parliament
- Advertisement -

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాడివేడిగా సాగనున్నాయి శీతాకాల సమావేశాలు. పార్లమెంట్ ముందుకు మొత్తం 37 బిల్లులు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం.

నేడు మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. నేడు సభకు హాజరుకావాలని తమ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది బిజెపి, కాంగ్రెస్ పార్టీలు. పెగసస్​, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కనీస మద్దతు ధరకు చట్టబద్దత, చైనా చొరబాట్లు వంటి అంశాలను పార్లమెంట్ లో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

- Advertisement -