- Advertisement -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై కసరత్తు ముమ్మరం చేశారు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్.
పార్లమెంట్ రెండు సమావేశాల మధ్య గ్యాప్ ఆరు నెలలు మించి ఉండకూడదన్ననిబంధనలతో సెప్టెంబర్ మొదటివారంలో సమావేశాలను నిర్వహించాలని యోచిస్తోంది. లోక్‌సభ సమావేశాలను పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో,రాజ్యసభ సమావేశాలను లోక్‌సభ ఛాంబర్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తున్నది.
- Advertisement -