Budget 2024:రేపటి నుండే పార్లమెంట్ సమావేశాలు

29
- Advertisement -

రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ముర్ము. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం.

ఉదయం 11.30గం.లకు మొదలుకానుంది అఖిలపక్ష సమావేశం. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది కేంద్రం. కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో… ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం.

ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదానికి తీసుకురానుంది కేంద్రం. ఈ బిల్లులు అన్ని ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశ పెట్టినందున… ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లపై కూడా అన్ని పార్టీలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరనుంది ప్రభుత్వం.

Also Read:Congress:కూటమిలో శత్రువు.. కాంగ్రెసే?

- Advertisement -