పార్లే సేల్స్ ఢమాల్.. 10వేల ఉద్యోగాల కోత!

449
parle g
- Advertisement -

నోట్ల రద్దు,జీఎస్టీ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎన్నో చిన్న కంపెనీలు మూతపడగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కొల్పోతున్నారు. తాజాగా భారత్ ఆర్ధికమాంద్యం ముందున్న కథనాలు వెలువుడుతుండగా ఓవైపు ఆటో మొబైల్ రంగం దివాళ తీసే పరిస్ధితి రాగా తాజాగా పార్లే బిస్కెట్ల కంపెనీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

దాదాపు 10 వేల ఉద్యోగాల కోత విధించనున్నట్లు సమాచారం. జీఎస్టీ రేటు పెరగడంతో తయారీ వ్యయం పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్లే బిస్కేట్ల రేట్లు పెంచింది యాజమాన్యం. దీంతో పార్లే బిస్కెట్లను కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. సేల్స్ తగ్గడం.. తయారీ వ్యయం ఎక్కువగా ఉండటంతో పార్లే కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.

గత్యంతరం లేని పరిస్థితుల్లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులను తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకోనుంది. బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరణ్ బెర్రీ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. రూ.5 బిస్కెట్ల ప్యాకెట్లను కొనేందుకు వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనే పరిస్థితి ఉందన్నారు.

ముడిసరుకులపై ధరల పెంపుతో  గ్లూకోస్, మ్యారీ బిస్కేట్ల సేల్స్ కూడా భారీగా తగ్గాయన్నారు. బిస్కెట్ల తయారీకి వాడే 100కిలోలు కంటే తక్కువకు విక్రయించే గ్లూకోజ్, మ్యారీ, మిల్క్ ప్రొడక్టులపై జీఎస్టీ 18శాతం విధించడం సేల్స్ తగ్గడానికి కారణమని చెప్పారు. తప్పని సరి పరిస్ధితుల్లో బిస్కెట్ల ధరలు పెంచినా సేల్స్‌ లేకపోవడంతో ఉద్యోగాల కోత తప్పడం లేదన్నారు.

- Advertisement -