పతంజలి రెస్టారెంట్లు వస్తున్నాయ్‌..!

251
Baba Ramdev Enters Restaurent Business
- Advertisement -

మార్కెట్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న సంస్ధ పతంజలి.యోగాతో  వచ్చిన క్రేజ్‌తో పతాంజలి ఆయుర్వేదిక్‌ బ్రాండ్‌ను తెరమీదకు తెచ్చారు బాబా రాందేవ్. తక్కువ కాలంలోనే పతాంజలి బ్రాండ్స్‌  ఇండియన్‌ మార్కెట్లో దుమ్మురేపాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పతంజలి సంస్థలు వెలిశాయి. తొలుత ఆయుర్వేదిక్ బ్రాండ్లతో ఎంట్రీ ఇచ్చిన బాబా రాందేవ్  తర్వాత వంట సామాన్ల దగ్గరి నుంచి కాస్మోటిక్ వస్తువులను సైతం తయారుచేసి  మార్కెట్ లో తనపట్టును సాధించుకుంది. త్వరలో పతంజలి జీన్స్‌ను తీసుకొస్తామని ప్రకటించిన ఈ సంస్థ ప్రస్తుతం 500 రకలా ఉత్పత్తులతో ప్రధాన కంపెనీలకు గట్టిపోటినిస్తోంది.

Baba Ramdev Enters Restaurent Business

ఇక తాజాగా  రామ్ దేవ్ బాబా… కొత్తగా రెస్టారెంట్ మార్కెట్ లోకి ప్రవేశించారు. పంజాబ్ రాజధాని చంఢీఘర్ లో రెస్టారెంట్ ప్రారంభించారు. పోస్తిక్ రెస్టారెంట్ పేరుతో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ గోడలపై రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ ఫొటోలతోపాటు మెనూ పెట్టారు. హెల్త్ టిప్స్ తో పాటు… పోషకాహార విలువలను రాశారు. 100 శాతం శాఖాహార రెస్టారెంట్ ఇది.

తొలుత ఈ రెస్టారెంట్ బయటి వాళ్లు చేశారని భావించినా… రిజిస్ట్రేషన్ వివరాలు గమనిస్తే… పతంజలి పేరుపై రిజిస్టర్ చేయించారు. త్వరలోనే మరిన్ని రెస్టారెంట్లు ప్రారంభించే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రెస్టారెంట్లు ప్రారంభించనున్నట్టు సమాచారం.

- Advertisement -