దటీజ్ చిరు..24 గంటల్లో 23 మిలియన్ వ్యూస్

487
sye raa teaser
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చాసుదీప్‌, విజ‌య్ సేతుతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంగళవారం టీజర్ విడుదల కాగా యూ ట్యూబ్‌ని షేక్ చేసింది. వివిధ భాషల్లో విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.తెలుగు,తమిళ,హిందీ,మలయాళం,కన్నడ భాషల్లో కలిపి కేవలం 24 గంటల్లోనే 23.2 డిజిటల్ వ్యూస్‌ని రాబట్టి చిరు స్టెమినాను నిరూపించింది.

ఆక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం అందరి అంచనాలను మించేలా ఉంటుందని టీజర్‌ని చూస్తే అర్ధమవుతోంది. మొత్తంగా సైరాతో చిరు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

- Advertisement -