Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం

13
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు అమన్. ప్యూర్టోరికోకు చెందిన డేరియన్ క్రజ్ తో జరిగిన మ్యాచ్ లో 13-5 పాయింట్ల తేడాతో అమన్ గెలుపొందారు. రెజ్లింగ్ లో భారత్ కు ఇదే తొలి మెడల్.

సెమీస్‌లో జపాన్‌ రెజ్లర్‌ హిగూచి చేతిలో ఓడిన అమన్‌ కాంస్య పోరులో ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. మొదటి రౌండ్‌ ముగిసేసరికి 6-3 ఆధిక్యంలో ఉండగా ముక్కుపై గాయమై రక్తపు చుక్కలు కారుతున్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

దీంతో భారత్‌ తరఫున అత్యంత పిన్న వయస్సు(21ఏండ్లు) లో ఒలింపిక్‌ పతకం నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

Also Read:ట్రెండింగ్‌లో బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ లుక్‌

- Advertisement -