బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అంటే అమ్మాయిలకు ఎంతో క్రేజ్. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నా సైఫ్ కున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా అతని మీద తనకు ఎంత ప్రేమ ఉందో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తెలిపింది. పరిణీతి చోప్రా ఈ రోజు(గురువార) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆమె 33 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. నటి పరంగా ఆమెకు బోలేడు మంది అభిమానుల ఫాలోయింగ్ ఉన్నప్పటికీ తను మాత్రం సైఫ్‌కు పిచ్చి ఫ్యాన్ అని చెబుతున్నారు.
సైఫ్‌ను అభిమానించడమే కాకుండా అతనిని ప్రేమించే దానిని వెల్లడించారు. కానీ దూరంగా ఉంటూనే ఇవ్వన్ని చేసేదాన్నని, ఎప్పుడూ అతనికి చెప్పలేదని పేర్కొన్నారు. సైఫ్ ను తాను చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది. సైఫ్ ను తప్ప మరెవరినీ ఇష్టపడలేనని తెలిపింది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని ఆయన భార్య కరీనాకు కూడా చెప్పానని అంది. పరిణీతి నటించిన తాజా చిత్రం ‘జబారియో’. విడుదలకు సిద్ధంగా వున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా ఆమె నటించింది. ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిణీతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.