బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా నిలిచారు పల్లవి ప్రశాంత్. 105 రోజుల పాటు ఉల్టా పల్టా అంటూ ఊహించని ట్విస్ట్‌లతో సాగిన బిగ్ బాస్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. 20 మంది కంటెస్టెంట్స్‌తో సాగిన ఈ షోలో చివరకు అమర్- ప్రశాంత్ మిగలగా అందరి అభిమానాన్ని గెలుచుకున్న ప్రశాంత్ విజేతగా నిలిచారు.
గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు చేశారు. ఆటలు,పాటలు,డాన్స్‌లు,గెస్ట్‌లు,ప్రమోషన్స్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. హౌస్‌లో మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్‌లు ఉండగా మొదట అంబటి అర్జున్, తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయ్యారు. ఇక యావర్ రూ. 15 లక్షల బ్రీఫ్ కేస్‌తో బయటికి రాగా తర్వాత టాప్ 3లో ఉన్న శివాజీ బయటికొచ్చాడు.
105 రోజుల్లో శ్రీకాంత్,అనిల్ రావిపూడి,లారెన్స్,రామ్ తదితరులు తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎంటర్‌టైన్ చేశారు.
Also Read:Bigg Boss 7:రూ. 15 లక్షలతో బయటికొచ్చిన యావర్