బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 5వ వారం పూర్తికావడానికి వచ్చింది. ఇక 5వ వారం ఈ సీజన్ తొలి కెప్టెన్‌గా నిలిచారు పల్లవి ప్రశాంత్. సందీప్-అమర్ దీప్‌లో ఒకరు తమ లెటర్‌తో పాటు కెప్టెన్సీ కంటెండర్ షిప్‌ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. తర్వాత పల్లవి ప్రశాంత్- శివాజీ యాక్టివిటీ రూమ్‌కి వెళ్లగా అక్కడ శివాజీకి లెటర్‌తో పాటు ఓ కాఫీ కప్పు కూడా ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. ఇది చూసిన వెంటనే శివాజీకి ఊపొచ్చింది. తర్వాత తన లెటర్‌ని చదువుతూ ప్రశాంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు.
ఇక కెప్టెన్సీ టాస్క్ కోసం ఫైనల్‌గా ప్రశాంత్, సందీప్, టేస్టీ తేజ, గౌతమ్ మిగలగా నలుగురికి రంగు పడుద్ది రాజా అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా నలుగురు కంటెస్టెంట్లు వాళ్ల అపోనెంట్స్ టీ షర్ట్‌పై వీలైనన్నీ ఎక్కువ సార్లు చేత్తో పెయింట్ పూస్తూ.. తమ టీ షర్ట్‌పై వేరే అపోనెంట్స్ పెయింట్ అంటకుండా కాపాడుకోవాలి.. మొత్తం మూడు రౌండ్స్ ఉంటాయి. బజర్ మోగినప్పుడు టాస్క్ మొదలవుతుంది.. మళ్లీ బజర్ మోగాక ఆపేయాలని చెప్పారు. లాస్ట్ రౌండ్ ముగిసే సరికి ఎవరి టీ షర్ట్‌పై అయితే తక్కువ పెయింట్ ఉంటుందో వాళ్లీ ఈ సీజన్ మొదటి కెప్టెన్ అని చెప్పాడు బిగ్ బాస్.
మొదటి రౌండ్‌లో బజర్ మోగగానే ప్రశాంత్‌ని టార్గెట్ చేశాడు సందీప్. అదే సమయంలో వెనక నుంచి గౌతమ్.. సందీప్‌కి పెయింట్ పూసేశాడు. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి సందీప్ టీ షర్ట్ మీద ఎక్కువ రంగు ఉంది.ఇక రెండో రౌండ్‌లో సందీప్‌కి గౌతమ్‌కి మధ్‌య పెద్ద గొడవ జరిగింది. ఈ రెండు రౌండ్లలో సందీప్, టేస్టీ తేజ ఔట్ కాగా ఫైనల్ రౌండ్‌లో ప్రశాంత్- గౌతమ్ పోటీ పడ్డారు. అయితే గౌతమ్ కండల వీరుడు కావడంతో ప్రశాంత్‌ను బలవంతంగా బయటికి తోసేద్దామని ట్రై చేశాడు. కానీ ప్రశాంత్ తెలివిగా తాను వెళ్లిపోతూ గౌతమ్‌ను కూడా లాగేశాడు. దీంతో ఇద్దరినీ ఔట్ అనడం కరెక్ట్ కాదు కాబట్టి బజర్ మోగే వరకు ఆడాలని ప్రియాంక చెప్పింది. బజర్ మోగిన తర్వాత ఇద్దరి టీ షర్టులు చూసి పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు ప్రియాంక చెప్పింది. దీంతో హౌస్‌కు తొలి కెప్టెన్‌గా నిలిచాడు ప్రశాంత్.
Also Read:లండన్ అంబేద్కర్ మ్యూజియంలో ఎమ్మెల్సీ కవిత..