రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పల్లవి ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ మల్కా కొమురయ్య మొక్కలు నాటారు.నేడు ఆయన జన్మదినం సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మహేంద్ర హిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని సిఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో పచ్చదనం సంతరించుకోవాలని ప్రకృతి వనాలను నిర్మించడం భవిష్యత్ తరాలకు ఒక వరం అని అన్నారు. ప్రజలంతా హరితహారంలో భాగస్వాములు కావాలని, మంచి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు.
అడవుల అభివృద్ధి 28 శాతం వరకు పెరిగాయంటే అది కేసీఆర్, కేటీఆర్, సంతోష్‌ల కృషి ఫలితం అని చెప్పారు. తను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తన విద్యార్థులను, తల్లితద్రులను భాగస్వామ్యం చేసి తన వంతు బాధ్యత నిర్వహిస్తానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.