కానుకలను దొంగలించాడు:ఖవాజా

310
- Advertisement -

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రిపై ఆదేశ రక్షణ మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్…ఆదేశ తోషాఖానా నుంచి ప్రభుత్వ బహుమతులను అమ్ముకున్నారని ఆరోపించారు. గతంలోనే పాక్‌ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌ ఖాన్ అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇమ్రాన్‌ఖాన్ తోషాఖానా కేసుకు సంబంధించి స్థానిక రాజ్యాంగంలో ఆర్టికల్ 63(1) ప్రకారం ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన్ అనర్హుడని గతంలోనే ప్రకటించారు. దీనికి కారణంగా గతంలో ప్రధానిగా ఉన్న సమయంలో విదేశి ప్రభుత్వాలు ఇచ్చే బహుమతులను పాక్ ప్రభుత్వం తోషాఖానా అనే వ్యవస్థ ద్వారా వాటిని భద్రపరుస్తారు. కానీ వాటిని అమ్మకం కొనుగోలు చేయకూడదు.

కానీ గతంలో ప్రధానిమంత్రిగా పనిచేసిన కాలంలో విదేశీ నేతల నుంచి స్వీకరించిన బహుమతుల్లో నాలుగింటిని అమ్మేసినట్లు అంగీకరించారు. వీటి విలువ 21.56మిలియన్ పాకిస్థానీ రూపాయలను చెల్లించి ఖజానా నుంచి తీసుకున్నానని వాటిని అమ్మగా 58మిలియన్ పాకిస్థానీ రూపాయలు వచ్చాయని తెలిపారు. అయితే తాజాగా ఆదేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ పాకిస్తాన్ ల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో గెలుపొందిన గోల్డ్‌ మెడల్‌ను ఆమ్ముకున్నారని ఆరోపించారు. తాను ప్రధానిగా ఉన్నకాలంలో నాలుగుసార్లు తోషాఖానా నుంచి విలువైన వస్తువులను అమ్ముకున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

బద్నాం చేసేందుకే దాడులు

అమ్మాయి అయితే చాలు… ఇప్పుడు ఇదే ట్రెండ్!

చిరంజీవికి శుభాకాంక్షలు :ఎఫ్దీసి చైర్మన్ అనిల్

- Advertisement -