బంగ్లాపై ఫిర్యాదు చేసిన పాక్

5
- Advertisement -

బంగ్లాదేశ్‌పై ఫిర్యాదు నమోదు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు . మూడో వన్డే మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదాస్పద డీఆర్‌ఎస్ (DRS) నిర్ణయం కారణంగా ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన మ్యాచ్ చివరి ఓవర్‌లో చోటుచేసుకుంది.

బంగ్లా వర్సెస్ పాక్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ కంటే ఎక్కువగా డీఆర్‌ఎస్ వివాదం చర్చనీయాంశంగా మారింది.

మ్యాచ్ చివరి ముందు బంతిపై ఈ వివాదం తలెత్తింది. ఆ సమయంలో పాకిస్థాన్‌కు చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. పాకిస్థాన్ ఆటగాడు షాహీన్ ఆఫ్రిది బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్ రషిద్ హొస్సేన్ వేసిన బంతి లెగ్‌సైడ్ వైపు వెళ్లడంతో అంపైర్ దాన్ని ‘వైడ్’గా ప్రకటించాడు.

అయితే కొంత చర్చ అనంతరం బంగ్లాదేశ్ జట్టు ఆ బంతిపై ఎల్‌బీడబ్ల్యూ కోసం రివ్యూ తీసుకుంది. సాధారణంగా రివ్యూ తీసుకునే నిర్ణయం పెద్ద స్క్రీన్‌పై రీప్లేలు చూపించే ముందు తీసుకోవాలి. కానీ రీప్లే చూపించిన తర్వాతే బంగ్లాదేశ్ రివ్యూ తీసుకుందని పాకిస్థాన్ ఆరోపించింది.

హాక్‌ఐ పరిశీలనలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు సూచించే స్పైక్ కనిపించడంతో అది వైడ్ కాదని తేలింది. చివరకు బంగ్లాదేశ్ రివ్యూ కోల్పోయినా మ్యాచ్ కొనసాగింది. చివరి బంతికి పాకిస్థాన్‌కు 12 పరుగులు అవసరం కాగా, బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

Also Read:2027 వరల్డ్ కప్‌ గెలవడమే టార్గెట్!

- Advertisement -