రాషా తడనీ..బర్త్ డే స్పెషల్

4
- Advertisement -

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస మంగపురం. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు మేనల్లుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ యువ నటి రాషా తడనీ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. సినిమాలో ఆమె “మంగా” అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన “ఉయి అమ్మా” పాటతో రాశా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

రాశా థడానీ పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస మంగాపురం సినిమా బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ బర్త్‌డే గ్లింప్స్ వీడియోలో షూటింగ్ సెట్స్‌లో రాశా చలాకీగా, అల్లరి స్వభావంతో కనిపిస్తూ ఆకట్టుకుంది. బీహైండ్ ది సీన్స్ క్షణాలు కూడా వీడియోలో చూపించడంతో అభిమానులను అలరించాయి.

Also Read:2027 వరల్డ్ కప్‌ గెలవడమే టార్గెట్!

ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్నారు. పి. కిరణ్ ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.చిత్రీకరణ వేగంగా కొనసాగుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

- Advertisement -