భారత క్రికెట్ జట్టుకు 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం ప్రధాన లక్ష్యమని భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపారు. ఇటీవల జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గిల్, భారత జట్టు భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన పలువురు ఆటగాళ్లను బీసీసీఐ సత్కరించింది. మహిళల విభాగంలో స్మృతి మందన్న ‘ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. అలాగే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్లను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గిల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో జరిగిన నిరాశ తర్వాత భారత జట్టు లక్ష్యం ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ అని చెప్పారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 దక్షిణాఫ్రికాలో జరగనుండగా, ఆ టోర్నమెంట్‌ను గెలవడం తమకు గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.
గతసారి భారత్‌లో జరిగిన ఫైనల్‌లో మేము విజయానికి చాలా దగ్గరగా వెళ్లాం. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో మరోసారి అవకాశం రావడం మా కోసం గొప్ప అవకాశం. దేశం కోసం ఏ ఫార్మాట్‌లో అయినా వరల్డ్ కప్ గెలవడం అత్యున్నత లక్ష్యం అని గిల్ అన్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌ను మళ్లీ ఆడే అవకాశం వస్తే తప్పకుండా గెలవాలని కోరుకుంటాను. మాకు అప్పట్లో ఒక్క స్పార్క్ మాత్రమే కావాలి. ఆ తర్వాతి సంవత్సరాల్లో మేము పలు విజయాలు సాధించాం అని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు.
Also Read:ఘనంగా కుల్దీప్ యాదవ్ వివాహాం

