బంగ్లాపై గెలిచినా పాక్‌కు తప్పని నిరాశ…

333
pakisthan
- Advertisement -

ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది పాకిస్థాన్‌. సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే బంగ్లాపై మెరుగైన నెట్‌ రన్‌ రేట్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ గెలిచింది కానీ సెమీస్ బెర్త్‌ను మాత్రం కన్ఫామ్‌ చేసుకోలేకపోయింది.

పాక్ విధించిన 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. షకీబల్‌ హసన్‌ (64) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షహీన్‌ షా అఫ్రీది 6 వికెట్లతో విజృంభించాడు. షాదాబ్‌ ఖాన్‌ 2, ఆమిర్‌, వహాబ్‌ రియాజ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌ (100 ) సెంచరీతో రాణించగా బాబర్ ఆజామ్‌ 96, ఇమాద్‌ వసీం 43, మహ్మద్‌ హఫీజ్‌ 27 రాణించారు. ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ 5 వికెట్లు పడగొట్టగా సైఫుద్దీన్‌ 3 వికెట్లు తీశాడు.

బంగ్లాను 316 పరుగుల తేడాతో ఓడిస్తేనే పాక్‌ సెమీస్‌ అవకాశాలు ఉండేవి. కానీ, 315 రన్స్‌ మాత్రమే ఆ జట్టు స్కోరుబోర్డుపై ఉంచగలిగింది. ఛేదనలో ప్రత్యర్థిని 7 పరుగులకే ఆలౌట్‌ చేస్తే ఆ జట్టుకు మరో చాన్స్‌ ఉండేది. అదెలాగూ సాధ్యం కాకపోవడంతో 1992 విజేతకు నాకౌట్‌ దారులు మూసుకుపోయాయి.

- Advertisement -