- Advertisement -
రోహిత్ శర్మ టీమ్ పాక్‌కు చుక్కలు చూపించింది. ఆసియా కప్‌లో టీమిండియా బౌలింగ్‌కు పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. ఇండియన్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కేవలం 43.1 ఓవర్లకు 162 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజామ్ (47; 62 బంతుల్లో 6×4), షోయబ్ మాలిక్ (43; 67 బంతుల్లో 1×4, 1×6) మాత్రమే అర్ధశతకాలకు చేరువయ్యారు. మిగతావారు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో 3 వికెట్లు తీయగా బుమ్రా 2 వికెట్లు తీశాడు.
ఆరంభంలో ఓపెనర్ల వికెట్లు తీసిన భువనేశ్వర్ పాక్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బాబర్, మాలిక్‌లు కొంత నిలకడగా ఆడారు. అయితే ఆ ఇద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ పడిన తర్వాత ఇక పాక్ కోలుకోలేదు. భారీ స్కోర్ సాధిస్తుందని ఆశించిన పాక్.. తక్కువ స్కోర్‌కే చేతులెత్తేసింది. 163 రన్స్ టార్గెట్‌తో భారత్ మరికాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.
- Advertisement -