సెన్సార్ పూర్తి చేసుకున్న’సామి’..

218
Saamy

సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టిఫికెట్ ను తెచ్చుకుంది.

Saamy

ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. బాబీసింహా విలన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో విక్రమ్ సరసన ఒక కథానాయికగా కీర్తి సురేశ్ .. మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటించారు.