జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన కలచివేసే దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో, పర్యాటకులు బైసరాన్ గ్రౌండ్‌లో సరదాగా డ్యాన్స్ చేస్తుండగా ఉగ్రవాదుల్లో ఒకరు వారిపై అతి సమీపం నుండి కాల్పులు జరపగా వీడియోలో గన్‌షాట్‌లు, పర్యాటకుల అరుపులు వినిపించాయి.
ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా (LeT) అనుబంధమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్టు ప్రకటించింది. ఐదు నుంచి ఆరు మంది ఉగ్రవాదులు ఈ దాడిని నిర్వహించగా, ఇందులో 28 మంది మరణించారు. వీరిలో 27 మంది పర్యాటకులు, మరో వ్యక్తి స్థానిక పోనీ గైడ్ అయిన సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఉన్నాడు.
🚨 Horrific! Pahalgam terror attack video surfaces 💔
— Avenge Pahalgam 🙏 pic.twitter.com/C88MZovoWy
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 24, 2025
Also Read:ఆపరేషన్ కగార్..మావోలకు దడ!

