సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పద్మావతి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసింది. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజస్థాన్‌లో కర్ణిసేన గత కొన్ని రోజులగా ఆందోళనలు నిర్వహిస్తోంది. బీజేపీ నేతలు ఈ మూవీపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అద్వానీ దర్శకుడు భన్సాలీకి మద్దతుగా నిలిచారు.సినిమా విషయంలో ఇప్పటికే చాలా మంది కలగజేసుకున్నారని ఇక ప్యానెల్ కలగజేసుకోవాల్సిన అవసరంలేదని ప్యానెల్ ఛైర్మన్ ఠాకూర్‌కు అద్వాని తెలిపారు.
పద్మావతి సినిమాపై చర్చించేందుకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గురువారం పార్లమెంట్ ప్యానెల్‌కు హాజరయ్యారు. ఈ ప్యానెల్‌కు సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి కూడా వెళ్లారు.సమావేశంలో జోషి, ప్యానెల్ ఛైర్మన్ అనురాగ్ ఠాకూర్ సినిమా గురించి మాట్లాడుతూ భన్సాలీపై మండిపడ్డారు. సినిమా సెన్సార్‌కు రాకముందే మీడియా వర్గాలకు ఎందుకు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భన్సాలీ సెన్సార్ బోర్డును అవమానించారని జోషి ఆరోపించారు.అయితే అద్వానీ మాత్రం భన్సాలీకి మద్దతుగా నిలవడం విశేషం.
గతంలో ఉప-రాష్ట్రపతి వెంకయ్య సైతం పద్మావతి గందరగోళంపై స్పందించిన సంగతి తెలిసిందే. కళాకారులను బెదిరించి, వారిపై దాడులకు పాల్పడితే నగదు నజరానాలు ఇస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని వెంకయ్య వ్యాఖ్యానించారు.