ఎంపీ అరవింద్‌ షాక్‌..వడ్లు పోసి రైతుల నిరసన

65
Farmers
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఊహించని షాక్ తగిలింది. అరవింద్ ఇంటి ముందు ట్రాకర్ట్‌తో రైతులు వడ్లు పోసి నిరసన తెలిపారు. యాసంగిలో పండించిన పంట మొత్తాన్ని కొనాలని కేంద్రంపై టీఆర్ఎస్,రైతులు పోరుబాట చేస్తున్నారు. అయితే కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి తోడు సీఎం కేసీఆర్ విధించిన 24 గంటల డెడ్ లైన్ మధ్యాహ్నంతో ముగియనుండగా సీఎం కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఎంపీ అరవింద్‌కు రైతుల నిరసన తలనొప్పిగా మారింది.

ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఎంపీ అరవింద్ ఇంటి వద్ద రైతుల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు .

- Advertisement -