పసుపుబోర్డు సాధిస్తారా..రాజీనామా చేస్తారా..!

618
nizamabad
- Advertisement -

దేశవ్యాప్తంగా నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఫలితం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. హోరాహోరీగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై బీజేపీ నేత ధర్మపురి అరవింద్ గెలుపొందారు. పసుపు బోర్డు కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్దసంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో స్థానికంగానే కాదు.. జాతీయ స్ధాయిలో ఇందూరు ఫలితంపై చర్చకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలకనేతలు రాజ్ నాథ్‌ సింగ్,రాంమాధవ్‌లు పసుపుబోర్డు ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అరవింద్ గెలిస్తే పసుపుబోర్డు ఏర్పాటుచేస్తామని,నిజాం షుగర్స్‌ని తెరిపిస్తామని,ఎర్రజోన్న రైతులకు మద్దతు ధర ఇస్తామని వీరు ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు.

ఇక ధర్మపురి అరవింద్‌ అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి బాండ్ పేపరే రాసిచ్చారు. ఎర్రజోన్న రైతులకు మద్దతు ధర, పసుపు బోర్డు తీసుకురాని పక్షంలో రాజీనామా చేసి ప్రజలతో పాటు ఉద్యమ బాట పడతానని చెప్పారు.

ఎన్నికల ఫలితాలు రానేవచ్చాయి. కేంద్రంలో,నిజామాబాద్‌లో బీజేపీ గెలిచింది. దీంతో ఇప్పుడు రైతులు పసుపు బోర్డుతో పాటు ఎర్రజోన్న రైతులు మద్దతు ధర కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బీజేపీ నేతలు ఇచ్చిన మాట తప్పితే ధర్మపురి అరవింద్ చెప్పినట్లుగానే ఎంపీ పదవికి రాజీనామా చేసి పోరాటంలో కలిసిరావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన పసుపుబోర్డు అంశంలో బీజేపీ వెనుకడుగు వేస్తే రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

dharmapuri aravind

- Advertisement -