గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌ రెడ్డి..

401
kaushik reddy
- Advertisement -

టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి బంపర్ ఆఫర్ కొట్టారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్‌కు కౌశిక్‌ రెడ్డి పేరును సిఫారస్ చేసింది కేబినెట్.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యద‌ర్శి పైడి కౌశిక్ రెడ్డి గతనెల 21వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌ తీర్థం తీసుకున్నారు. ఆ సందర్భంలో కౌశిక్ రెడ్డి రాష్ట్ర స్ధాయిలో పనిచేస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును నామినేట్ చేశారు.

- Advertisement -