ఎస్‌ఎల్బీసీకి తొలగిన ఆటంకాలు..

97
cm
- Advertisement -

ఎస్‌ఎల్బీసీకి అడ్డంకులు తొలగాయి. నల్లగొండ జిల్లాకు సాగునీరు తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుండి ప్రారంభించిన ఎస్సెల్బీసీ సొరంగమార్గం పనులను పున:ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటు ఉదయ సముద్రం లిఫ్టు ఇరిగేషన్ స్కీం (బ్రాహ్మణ వెల్లెంల) ను కూడా త్వరితగతిన పూర్తిచేయడానికి కేబినెట్ ఆదేశాలు జారీచేసింది.

ఎస్సెల్బీసీ తవ్వకానికి ఇన్నాల్లనుంచి కొనసాగుతున్న సాంకేతిక, భౌగోళిక తదితర ఆటంకాలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలకోసం ఇరిగేషన్ శాఖను కేబినెట్ ఆదేశించింది. ఎస్సెల్బీసీ సొరంగమార్గం తొవ్వకానికి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన మేరకు నిరంతరంగా విద్యుత్ ను అందించాలని విద్యుత్ శాఖను ఆదేశించిన కేబినెట్. ఎస్సెల్బీసీ పనుల పున:ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకోసం నీటిపారుదల శాఖ కేబినెట్ ముందుంచిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -