తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలివే!

75
ts

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు అమోదం తెలిపారు. అనాథశరణాలయాల స్థితిగతుల కోసం సత్యవతి రాథోడ్ అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులుగా మంత్రలు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వివరాలు అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కేబినెట్ ఆదేశించింది.

() అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.
()కొత్తగా మంజూరైన 7 మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావాల్సిన నిర్మాణాలను చేపట్టాలని, సత్వరమే వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది.
() ధోబీ ఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ నిర్ణయాన్ని వారంలోగా అమలు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
()ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
()టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన పీవీ సింధును తెలంగాణ కేబినెట్ అభినందించింది.
()త్వరలో 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన ,వరంగల్, చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణం, టిమ్స్, ఎల్బీ నగర్ గడ్డి అన్నారం, అల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది.
()పటాన్ చెరులో కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు
()నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నియమించాలని నిర్ణయం

()వృద్ధాప్య ఫించన్ అర్హతను 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.