ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ నిలిపివేత…

287
oxford
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ రేసులో దూసుకుపోతున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ స్పీడ్ కు బ్రేక్ పడింది. అస్ట్రాజెనికా సంస్ధతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ వ్యాక్సిన్‌ తుదిదశలో ఉండగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఆస్ట్రాజెనికా సంస్థ.

టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మూడో దశ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ భద్రతపై మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పలు దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది.

ప్ర‌యోగ ప్రామాణిక ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌పై పూర్తిస్థాయి స‌మీక్ష కోసం ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. అయితే ఆ వాలంటీర్ కు ఎటువంటి అనారోగ్య సమస్య ఏర్పడిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

- Advertisement -